ఎన్టీఆర్ తో తమిళ డైరెక్టర్ ?

Published on Oct 24,2019 12:08 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తమిళ డైరెక్టర్ అట్లీ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళనాట అట్లీ కి మాస్ దర్శకుడిగా పేరుంది. స్టార్ హీరోలను మరింతగా మాస్ కు దగ్గర చేయడంలో అట్లీ ది అందవేసిన చేయి అనే చెప్పాలి ఎందుకంటే దానికి నిదర్శనమే అట్లీ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు. తాజాగా ఈ యువ దర్శకుడు దర్శకత్వం వహించిన చిత్రం బిగిల్ రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది.
తమిళ స్టార్ హీరో విజయ్ - అట్లీ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి దాంతో తమిళంలో బిగిల్ గా తెలుగులో విజిల్ గా వస్తున్న చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక దర్శకుడు అట్లీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే బాక్స్ లు బద్దలు కావడం ఖాయం ఎందుకంటే జూనియర్ ని మరింత ఫెరోషియస్ గా చూపించడం ఖాయం.