పులి తో ఫైటింగ్ చేస్తున్న ఎన్టీఆర్

Published on Sep 10,2019 11:31 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రియల్ టైగర్ తో రీల్ ఫైట్ చేస్తున్నాడట బల్గేరియాలో. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ బల్గేరియాలో జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా అక్కడ భారీ షెడ్యూల్ జరుగుతోంది, జూనియర్ ఎన్టీఆర్ పై పలు పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట జక్కన్న.  పనిలో పనిగా పులి తో కూడా ఓ ఫైట్ చిత్రీకరిస్తున్నారట. రియల్ టైగర్ తో యంగ్ టైగర్ రీల్ ఫైటింగ్ అన్నమాట.
జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో కొమరం భీం పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కొమరం భీం అంటే మన్యం వీరుడు కాబట్టి ఆ మన్యం లో ఉండే పులి తో ఫైటింగ్ పెట్టి ప్రేక్షకులను , ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని విశేషంగా అలరించేలా ప్లాన్ చేసాడట దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. ఇక ఈ చిత్రాన్ని 2020 జూలై లో విడుదల చేయనున్నారు.