ఎన్టీఆర్ వీడియో లీక్ అయోమయంలో జక్కన్న

Published on Dec 11,2019 02:40 PM

కొమరం భీం గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ వీడియో లీక్ కావడంతో అయోమయానికి లోనయ్యాడు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని ఎన్టీఆర్ గెటప్ లీక్ అయ్యింది. కొమరం భీం గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ మాట్లాడుతున్న సీన్ ని ఎవరో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు ఇంకేముంది అది వైరల్ అయ్యింది క్షణాల్లో. ఎన్టీఆర్ గెటప్ లీక్ కావడంతో షాక్ తిన్నాడు రాజమౌళి. లొకేషన్ లో ఎన్ని  కండీషన్ లు పెట్టినప్పటికీ ఎన్టీఆర్ వీడియో ఎలా లీక్ అయ్యిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడట జక్కన్న.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి ఎలాంటి లీకులు ఉండొద్దని గట్టి ప్రయత్నమే చేసాడు జక్కన్న కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ముందు జక్కన్న ఓడిపోయాడు. ఆర్ ఆర్ ఆర్ నుండి ఎలాంటి లీకులు ఉండొద్దని గట్టిగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోతూనే ఉంది. అయితే కొమరం భీం గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉన్నాడు. ఇలా మాములు విడియోలోనే ఇలా ఉంటే సిల్వర్ స్క్రీన్ పై ఎన్టీఆర్ ని కొమరం భీం గెటప్ లో చూడటం అంటే రెండు కళ్ళు సరిపోవనే చెప్పాలి. ప్రస్తుతం ఈ చిత్రం విశాఖ మన్యంలో షూటింగ్ జరుపుకుంటోంది.