త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ తదుపరి సినిమా కన్ఫర్మ్

Published on Jan 24,2020 09:51 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తదుపరి సినిమా కన్ఫర్మ్ అయ్యింది. అల ....... వైకుంఠపురములో చిత్రంతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లడం కాదు సుమా ! ఈ ఏడాది లోనే అందునా అన్నీ కుదిరితే వేసవిలోనే సెట్స్ మీదకు వెళ్లనుందట. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం జులై తర్వాతే షూటింగ్ లో జాయిన్ కానున్నాడట.

ఈ ఇద్దరి కాంబినేషన్ లో '' అరవింద సమేత '' చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా కొత్త ఎన్టీఆర్ ని చూపించింది. అందుకే వెంటనే త్రివిక్రమ్ కు ఛాన్స్ ఇచ్చాడు జూనియర్. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో పాల్గొంటున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమా జులై 30 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఒకవేళ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అయితే అప్పుడు దసరా కు విడుదల చేయాలనీ రెండో ఆలోచన చేస్తున్నారట.