తాతకు నివాళులు అర్పించిన ఎన్టీఆర్

Published on Jan 18,2020 12:23 PM

ఈరోజు మహానటుడు , మహానాయకుడు ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో తాతకు నివాళులర్పించాడు జూనియర్ ఎన్టీఆర్. ఈరోజు తెల్లవారు ఝామునే తాత సమాధి ఉన్న ప్రాంతమైన ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్నాడు ఎన్టీఆర్. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా తమ్ముడు ఎన్టీఆర్ వెంట తాత సమాధిని సందర్శించి తాతకు నివాళులు అర్పించాడు. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ వస్తున్న విషయం అభిమానులకు తెలియడంతో వాళ్ళు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తాత సమాధి వద్ద పుష్పాలను అలంకరించి తాతతో తమకున్న మధుర స్మృతులను నెమరువేసుకున్నారు సోదరులిద్దరూ. తాత సమాధి వద్దే కొద్దిసేపు కూర్చొని అక్కడి నుండి వెళ్లిపోయారు ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ లు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు ఈరోజు ఉదయం నుండి పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు , ఎన్టీఆర్ కుటుంబీకులు తరలి వచ్చి నివాళులు అర్పిస్తున్నారు.1996 జనవరి 18 న ఎన్టీఆర్ చనిపోయిన విషయం తెలిసిందే.