100 మిలియన్ వ్యూస్ కొట్టేసిన ఎన్టీఆర్ సాంగ్

Published on Nov 18,2019 05:38 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రంలోని '' నీ కళ్ళలోని కాటుక ఓ నల్ల మబ్బు కాగా '' అనే పాట 100 మిలియన్ వ్యూస్ ని సాధించింది. 2017 లో విడుదలైన జై లవకుశ చిత్రంలో నీ కళ్ళలోన అనే పాట హైలెట్ గా నిలిచింది. అయితే కాస్త ఆలస్యంగానైనా యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ని సాధించి సంచలనం సృష్టించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు 100 మిలియన్ వ్యూస్ సాధించిన తొలిపాట గా నిలిచింది ఈ పాట.

జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషించిన విషయం తెలిసిందే. కే ఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో కొమరం భీం గా నటిస్తున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు స్కై లెవల్లో ఉన్నాయి.