ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇచ్చిన బ్రిటిష్ భామ

Published on Apr 06,2019 01:55 PM
బ్రిటిష్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇచ్చింది . దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న చిత్రం '' ఆర్ ఆర్ ఆర్ '' . తెలుగు , తమిళ , హిందీ , మలయాళ బాషలలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో బ్రిటిష్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఒక హీరోయిన్ గా తీసుకున్నారు . 
ఆర్ ఆర్ ఆర్ లో నటించడం సంతోషం అని ప్రకటించి ఒప్పుకుంది కూడా కానీ ఎక్కడో తేడా కొట్టింది అందుకే ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇచ్చి ఆర్ ఆర్ ఆర్ సినిమా యూనిట్ ని తీవ్ర షాక్ కి గురి చేసింది డైసీ ఎడ్గర్ జోన్స్ . ఎన్టీఆర్ సరసన నటిస్తోంది అందాల భామ అని సంతోషపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డైసీ ఎడ్గర్ జోన్స్ నిర్ణయం తీవ్ర శరాఘాతం అనే చెప్పాలి . 
అసలే చరణ్ కాలికి గాయం కావడంతో షూటింగ్ ఆగిపోయింది ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ సరసన నటిస్తానని చెప్పిన డైసీ హ్యాండ్ ఇచ్చింది దాంతో అసలు ఏమి జరుగుతోందో అర్ధం కాక సతమతం అవుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .