లండన్ భామతో రొమాన్స్ చేస్తున్న ఎన్టీఆర్

Published on Nov 29,2019 12:04 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లండన్ భామ ఒలివియా మోరిస్ తో రొమాన్స్ చేస్తున్నాడు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా లండన్ భామ ఒలివియా మోరిస్ ఎన్టీఆర్ సరసన నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ భామని ఎంపిక చేసారు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ఎన్టీఆర్ - ఒలివియా మోరిస్ ల మధ్య పలు రొమాంటిక్ సీన్స్ ని చిత్రీకరిస్తున్నారట జక్కన్న.

స్టేజ్ ఆర్టిస్ట్ అయిన ఒలివియా మోరిస్ కు నటన అంటే కొట్టిన పిండి ,కాకపోతే తెలుగు చిత్రం కాబట్టి కాస్త నెర్వేస్ గా ఫీల్ అవుతోందని అయితే వెంటనే ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా తనని తాను మలుచుకుందని తెలుస్తోంది. ఈ లండన్ భామ కు లభించిన గోల్డెన్ ఛాన్స్ ఆర్ ఆర్ ఆర్ లో నటించడం అందునా జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించడం. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జులై 30 న విడుదల చేయనున్నారు.