ఎన్టీఆర్ ఆ సినిమాని రిజెక్ట్ చేసాడట

Published on Nov 21,2019 11:15 PM

 జూనియర్ ఎన్టీఆర్ ని తలైవి సినిమాలో నటించాలని అడిగారట అయితే ఆ చిత్రంలో నటించేది లేదని తేల్చి చెప్పాడట. ఇంతకీ తలైవి సినిమాని ఎందుకు రిజెక్ట్ చేసాడో తెలుసా ? ఏ పాత్ర పోషించాలని అడిగారో తెలుసా ? జయలలిత బయోపిక్ గా తెరకెక్కనున్న చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ని తాతయ్య ఎన్టీఆర్ పాత్ర పోషించాలని కోరారట ఆ చిత్ర దర్శక నిర్మాతలు. అయితే మహానటి సమయంలోనే ఆ ఛాన్స్ వస్తే జూనియర్ ఎన్టీఆర్ మొహమాటం లేకుండా చెప్పాడు తాతయ్య పాత్ర ని పోషించేది లేదని.

అయితే అప్పట్లో బాబాయ్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం చేస్తున్నాడు కాబట్టి క్లాష్ రావద్దని అలా చేసి ఉంటాడనుకొని మళ్ళీ తమిళ సినిమా జయలలిత బయోపిక్ లో గెస్ట్ గా నటించమని కోరారట కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నిర్మొహమాటంగా నో చెప్పాడట దాంతో చేసేది లేక ఎవరిని అడగాలా అని ఆలోచన చేసున్నారట జయలలిత బయోపిక్ దర్శక నిర్మాతలు.