ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమానట అది

Published on Aug 24,2019 10:33 AM

ప్రస్తుతం విజయ్ దేవరకొండ యాక్సెప్ట్ చేసిన ఫైటర్ కథ జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథ నట ! ఎన్టీఆర్ కు నచ్చలేదు కానీ విజయ్ దేవరకొండ కు నచ్చింది దాంతో ఫైటర్ సినిమా నవంబర్ నుండి షూటింగ్ కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది . దర్శకులు పూరి జగన్నాధ్ ఫైటర్ కథని మొదట జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించాడట కానీ ఆ కథ విన్నాకా జూనియర్ నో చెప్పాడట . 

దాంతో స్వల్ప మార్పులు చేసి విజయ్ దేవరకొండ కు చెప్పడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు . ఇంకేముంది నవంబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా విజయ్ కి దక్కింది . ఇక ఈ ఫైటర్ విడుదల అయితేనే ఎన్టీఆర్ తప్పు చేశాడా ? లేదా ? అన్నది తేలనుంది .