ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తామంటున్న ఎన్టీఆర్, చరణ్

Published on Jan 18,2020 02:44 PM

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన తర్వాత ఆ హీరోకు మరింత స్టార్ డం వస్తుంది అయితే తర్వాతి చిత్రం మాత్రం ప్లాప్ అవుతుంది ఇది అనాదిగా వస్తున్న సెంటిమెంట్ తెలుగునాట. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన ప్రతీ హీరో భారీ హిట్ కొడతారు కానీ తీరా ఆ సినిమా తర్వాత మాత్రం అట్టర్ ప్లాప్ తో చతికిల బడతారు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో నటించిన అందరి హీరోల పరిస్థితి ఇదే. ఎన్టీఆర్ , రాంచరణ్ , ప్రభాస్ , నితిన్ , నాని , రవితేజ , సునీల్ ఇలా రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఈ అందరు కూడా భారీ హిట్ లతో పాటుగా వెంటనే భారీ ప్లాప్ లను చవిచూశారు.

అందుకే ఈసారి అలాంటి సెంటిమెంట్ వర్కౌట్ కాకుండా దాన్ని బ్రేక్ చేయాలనీ చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లు. తాజాగా ఈ ఇద్దరు హీరోలు ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఈ సెంటిమెంట్ బలంగా పాతుకుపోయింది కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికి ఇప్పటి నుండే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట ఎన్టీఆర్ , చరణ్ లు. మరి ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేయగలరా ? లేదా ? అన్నది తెలియాలంటే 2021 వరకు ఎదురు చూడాల్సిందే.