తమిళంలో డబ్ అవుతున్న ఎన్టీఆర్ సినిమా

Published on Nov 19,2019 05:34 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రాన్ని విజయన్ పేరుతో తమిళంలో డబ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో 12 ఏళ్ల క్రితం వచ్చింది అయితే 12 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రాన్ని తమిళంలో డబ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ? దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి కి విపరీతమైన క్రేజ్ ఏర్పడటమే ! యమదొంగ చిత్రానికి దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అన్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ యముడిగా కూడా నటించి మెప్పించాడు. అయితే ఈ సినిమాని అప్పట్లో డబ్ చేయడానికి రీమేక్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో తెలుసా ....... బాహుబలి తర్వాత రాజమౌళి క్రేజ్ ప్రపంచ వ్యాప్తం అయ్యింది అందుకే ఈ యమదొంగ చిత్రాన్ని విజయన్ గా డబ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తో పాటుగా మోహన్ బాబు , ప్రియమణి , రంభ , మమతా మోహన్ దాస్ తదితరులు నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు.