ఎన్టీఆర్ మహానాయకుడు రీ షూట్

Published on Jan 23,2019 03:09 PM

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందిన విషయం తెలిసిందే . అయితే అందులో మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9 న విడుదల కాగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయింది . మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం దారుణంగా వచ్చాయి . దాంతో ఖంగుతిన్న ఎన్టీఆర్ బయోపిక్ బృందం రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు పై ద్రుష్టి పెట్టారు . 

ఎన్టీఆర్ మహానాయకుడు లో ఆశించిన స్థాయిలో లేని  సన్నివేశాలను  తొలగించి మరికొన్ని సన్నివేశాలను యాడ్ చేయనున్నారు . ముఖ్యంగా ఎన్టీఆర్- హరికృష్ణ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు . ఎన్టీఆర్ గా బాలయ్య - హరికృష్ణ గా కళ్యాణ్ రామ్ నటిస్తున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం బాలయ్య - కళ్యాణ్ రామ్ ల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు క్రిష్ . ఈ రీ షూట్ వల్ల సినిమాకు మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు . ఇక ఈ రెండో పార్ట్ ని ఫిబ్రవరి 14 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .