సంచలనం సృష్టిస్తున్న ఎన్టీఆర్ లుక్

Published on Nov 13,2019 05:58 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా లుక్ సంచలనం సృష్టిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాల టైటిల్స్ ని ఆధారంగా చేసుకొని ఎన్టీఆర్ ఆకృతిని తీర్చిదిద్దిన విధానానికి ఫిదా అవుతున్నారు. ఎన్టీఆర్ నటించిన సినిమాల టైటిల్స్ తో ఎన్టీఆర్ లుక్ ని రెడీ చేయడం అంటే మాములు విషయం కాదు. అయితే అంతటి మహా కార్యాన్ని ఓ అభిమాని చేయడం దాన్ని సోషల్ మీడియాలో వదలడంతో అది వైరల్ గా మారుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు. ఇంతకుముందు ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో ఆర్ ఆర్ ఆర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.