అమెజాన్ ప్రైమ్ లో ఎన్టీఆర్ బయోపిక్

Published on Feb 07,2019 05:42 PM

రేపు అమెజాన్ ప్రైమ్ లో ఎన్టీఆర్ బయోపిక్ లో తొలి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు ప్రసారం కానుంది . జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది అలాగే మంచి రివ్యూస్ కూడా వచ్చాయి కానీ ఆ స్థాయి వసూళ్లు మాత్రం రాలేదు . 70 కోట్ల కు ఈ సినిమాని అమ్మగా కేవలం 20 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది . 

దాంతో ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని కొన్న బయ్యర్లు దారుణంగా నష్టపోయారు . దాదాపుగా 50 కోట్ల నష్టం వచ్చింది బయ్యర్లకు అందుకే ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని వాళ్లకు ఇస్తున్నాడు బాలయ్య . ఇక ఎన్టీఆర్ కథానాయకుడు విషయానికి వస్తే ...... రేపు అనగా ఫిబ్రవరి 8న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు . నెల రోజుల వ్యవధిలోనే అమెజాన్ లో వస్తుండటం సంచలనం సృష్టిస్తోంది .