బల్గేరియాలో పోరాడుతున్న ఎన్టీఆర్

Published on Sep 05,2019 09:40 AM

జూనియర్ ఎన్టీఆర్ బల్గేరియాలో వీరోచితంగా పోరాటం చేస్తున్నాడట. పోరాటానికి ప్రతిరూపమైన కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కాగా ఆ పాత్ర కోసం తన శరీరాన్ని మరింత ధృడంగా మార్చుకునేలా తర్ఫీదు పొందిన ఎన్టీఆర్ బల్గేరియాలో అరివీర భయంకరంగా పోరాడుతున్నాడట. దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ పై అలాగే ఇతర ఫైటర్ లపై భారీ ఎత్తున ఈ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బల్గేరియా నుండి ఇండియాకు ఆర్ ఆర్ ఆర్ బృందం తిరిగి వచ్చాక రామోజీ ఫిలిం సిటీ లో రాంచరణ్ పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇక ఈ చిత్రాన్ని జూలై 30 న 2020 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.