అట్లీ దర్శకత్వంలో ఎన్టీఆర్

Published on Apr 16,2020 06:39 PM
ప్రముఖ తమిళ దర్శకులు అట్లీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ అయ్యాక త్రివిక్రమ్ దర్శకత్వంలో ''అయిననూ పోయిరావలె హస్తినకు '' అనే రాజకీయ నేపథ్య సినిమా చేయనున్నాడు. ఇక ఆ సినిమా అయ్యాక అట్లీ దర్శకత్వంలో నటించనున్నాడట ఎన్టీఆర్. అట్లీ దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.

అలాగే అతడి ప్రతీ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అట్లీ దర్శకత్వంలో నటించాలని ఎన్టీఆర్ కూడా ఎప్పటినుండో అనుకుంటున్నాడు కానీ కుదరలేదు అయితే ఈ కాంబినేషన్ ని సెట్ చేయడానికి అగ్ర నిర్మాత అశ్వనీదత్ రంగంలోకి దిగాడట. ఎన్టీఆర్ తో శక్తి అనే సినిమా చేసి దారుణంగా నష్టపోయాడు అశ్వనీదత్ దాంతో ఎన్టీఆర్ తో సూపర్ హిట్ తీయాలని కసిగా ఉన్నాడట ఈ నిర్మాత.