భారీ యాక్షన్ సీన్స్ లో ఎన్టీఆర్

Published on Aug 26,2019 12:03 PM

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా బల్గేరియా వెళ్ళాడు ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో కలిసి. అక్కడ భారీ యాక్షన్ సీన్స్ లో నటించనున్నాడు ఎన్టీఆర్. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. బల్గేరియా లో మూడు వారాల పాటు ఫైట్స్ తో పాటుగా ఛేజింగ్ సీన్స్ చిత్రీకరించనున్నారు రాజమౌళి. ఈ యాక్షన్ సీన్స్ ఎన్టీఆర్ పై చిత్రీకరించనున్నారు. 

రాంచరణ్ ఇందులో పాల్గొనడం లేదు , రాంచరణ్ లేని సన్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తున్నారు. మూడు వారాల తర్వాత మళ్ళీ హైదరాబాద్ తిరిగి రానున్నారు ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇక ఈ చిత్రాన్ని 2020 జూలై 30 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.