40 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న ఎన్టీఆర్

Published on Mar 13,2020 02:29 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే చిత్రం కోసం 40 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందుతున్న చిత్రం కావడంతో అప్పుడే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని చినబాబు - నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ రేంజ్ అనూహ్యంగా పెరిగింది కాబట్టి 40 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని నిర్ణయించారట నిర్మాతలు.

అలాగే త్రివిక్రమ్ కు 20 కోట్లు ముట్ట జెప్పనున్నారట రెమ్యునరేషన్ కింద. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామలు అయితే బాగుంటుందని అలియా భట్ ని ఎంపిక చేసే పనిలో పడ్డాడట త్రివిక్రమ్. అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ని ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారు దర్శకులు త్రివిక్రమ్.