నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పనున్న ఎన్టీఆర్

Published on Sep 04,2019 10:26 AM

జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఒక్క తెలుగులోనే కాకుండా హిందీ , తమిళ్ , మలయాళం లతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా అలాగే దేశంలోని ఇతర బాషలలో కూడా డబ్ చేసి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక తెలుగుతో పాటుగా తమిళ , మలయాళ , హిందీ బాషలలో ఎన్టీఆర్ చేత డబ్బింగ్ చెప్పించాలని నిర్ణయించాడట జక్కన్న. 
అందుకే హిందీ , మలయాళం , తమిళ్ బాషలలో మంచి పట్టు సాధించేలా ట్రైనింగ్ తీసుకోమని సలహా కూడా ఇచ్చాడట! అలాగే రాంచరణ్ కు కూడా . దాంతో మిగతా బాషలలో పట్టు సాధించడానికి ట్రై చేస్తున్నారట ఓ ట్యూటర్ ని పెట్టుకొని. ఆర్ ఆర్ ఆర్ సినిమా రాజమౌళి దర్శకత్వంలో వస్తోంది కాబట్టి తప్పకుండా అంతర్జాతీయ స్థాయి కలిగిన చిత్రంగా నిలుస్తుంది అందుకే తమ పాత్రలకు తామే ఇతర బాషలలో డబ్బింగ్ చెప్పుకోవాలని తర్ఫీదు పొందుతున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ పై భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు జక్కన్న.