సురేందర్ రెడ్డి పై మండిపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

Published on Nov 23,2019 06:41 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దర్శకులు సురేందర్ రెడ్డి పై మండిపడుతున్నారు. మా హీరో ని అవమానిస్తావా ? అంటూ నిప్పులు కక్కుతున్నారు సురేందర్ రెడ్డి పై. వీళ్లకు ఈ దర్శకుడిపై ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటంటే ...... అశోక్ సినిమా. 2006 లో వచ్చిన అశోక్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాకు దర్శకుడు సురేందర్ రెడ్డి. అశోక్ సినిమాని నాకు నచ్చకుండానే తీయాల్సి వచ్చిందని స్టేట్ మెంట్ ఇవ్వడమే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కోపం రావడానికి కారణం అయ్యింది.

ఆ సమయంలో ఎన్టీఆర్ తో కాకుండా ప్రభాస్ తో సినిమా చేయాలనీ అనుకున్నాడట సురేందర్ రెడ్డి అయితే ఎన్టీఆర్ మేనేజర్ ఒత్తిడి చేయడంతో కాదనలేక అశోక్ చేసానని తప్పంతా ఎన్టీఆర్ మీద అతడి మేనేజర్ మీద నెట్టేశాడు సురేందర్ రెడ్డి. అందుకే ఇతడి పై ఆగ్రహంగా ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అశోక్ ప్లాప్ అయ్యింది ఓకే ఇష్టం లేకుండా చేసావ్ మరి ఊసరవెల్లి సంగతి ఏంటి ? అని ప్రశ్నిస్తున్నారు. ఊసరవెల్లి కూడా సురేందర్ రెడ్డి దర్శకుడు మరి. ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.