రాంచరణ్ రాజమౌళి పై ఆగ్రహంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

Published on Mar 29,2020 05:30 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి పై అలాగే హీరో రాంచరణ్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులకు రాజమౌళి పై అలాగే చరణ్ లపై కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ....... ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో చరణ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే ! చరణ్ ని ఓ రేంజ్ లో చూపిస్తున్నట్లుగా యిట్టె అర్ధమైపోతుంది ఆర్ ఆర్ ఆర్ వీడియో చూస్తుంటే. అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం తెచ్చేలా చేసింది.

చరణ్ ని అన్నగా పోలుస్తూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ డైనమైట్ లా పేలినప్పటికీ చరణ్ గొప్పతనం ఎన్టీఆర్ చెప్పాల్సి వచ్చిందనేది అందుకు రాజమౌళి పై ఆగ్రహంగా ఉన్నారు. అలాగే టైటిల్ లో కూడా చరణ్ ని మొదటి ఆర్ లో చూపించారని ఎన్టీఆర్ ని మాత్రం చివరి ఆర్ లో చూపించారని మండిపడుతున్నారు. అయితే ఇప్పుడు కోపం ఉన్నప్పటికీ సినిమా విడుదల అయితే కానీ తెలీదు ఎవరిని ఎలా చూపించాడో అన్నది. ఇక అప్పుడు ఉంటుంది అసలు ఫైటింగ్.