నివేదా థామస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

Published on Jan 05,2020 11:28 AM

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది అంతే హీరోయిన్ నివేదా థామస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నివేదా థామస్ పై కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ....... నిన్న జరిగిన దర్బార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో టాలీవుడ్ లోని స్టార్ హీరోలైన మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , చిరంజీవి , అల్లు అర్జున్ , నాని తదితరులను గుర్తుపెట్టుకొని మరీ తన ప్రసంగంలో ప్రస్తావించింది అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరు మాత్రం టచ్ చేయలేదు దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కోపం వచ్చింది అంతే నివేదా పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించకపోయి ఉంటే పేరు ప్రస్తావించకపోయినా సర్దుకునే వాళ్ళు కానీ జై లవకుశ చిత్రంలో ఒక హీరోయిన్ గా నటించింది కదా ! దాంతో కోపం ఎక్కువయ్యింది మరి. మహేష్ బాబు సరసన నటించలేదు అయినా పేరు చెప్పింది అలాగే చిరంజీవి సరసన కూడా నటించలేదు , అలాగే పవన్ కానీ వీళ్లందరి పేర్లు చెప్పి ఎన్టీఆర్ పేరు చెప్పకపోవడంతో ఇలా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నిజమే కదా ! జై లవకుశ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించి కూడా ఎందుకు అతడి పేరు ప్రస్తావించ లేదో