మే 20 న ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వనున్న ఎన్టీఆర్

Published on Apr 18,2020 04:14 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వడానికి సిద్దమయ్యాడు. మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి కొమరం భీం గెటప్ లో ఉన్న ఎన్టీఆర్ వీడియో ని విడుదల చేయనున్నారు ఆర్ ఆర్ ఆర్ టీమ్. అలాగే అదే రోజున త్రివిక్రమ్ సినిమా నుండి ఎన్టీఆర్ నటించనున్న కొత్త సినిమా టైటిల్ తో పాటుగా ఎన్టీఆర్ లుక్ ని కూడా విడుదల చేయనున్నారట.

త్రివిక్రమ్ దర్శకత్వంలో అయిననూ పోయిరావలె హస్తినకు అనే సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఆసినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సమయం పడుతుంది అందుకే టైటిల్ తో పాటుగా ఎన్టీఆర్ లుక్ ని విడుదల చేయనున్నారట. మొత్తానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా దక్కనుంది ఈ పుట్టినరోజుకి.