ఎన్టీఆర్ తో ఆ సినిమాని అయిష్టంగానే చేసాడట

Published on Nov 19,2019 09:30 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అశోక్ అనే సినిమాని అయిష్టంగానే చేసానని అందుకే డిజాస్టర్ అయ్యిందని ఇన్నాళ్ల తర్వాత అంటున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఎన్టీఆర్ హీరోగా నటించిన అశోక్ సినిమాలో సమీరా రెడ్డి హీరోయిన్ గా నటించింది. 2006 లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా కథ నాది కాదని , నాకు ఇష్టం లేకుండానే అశోక్ సినిమాకు దర్శకత్వం వహించాల్సి వచ్చిందని అంటున్నాడు సురేందర్ రెడ్డి.

అయితే అశోక్ కథ ఈ దర్శకుడిది కాదు ఒకే మరి ఎన్టీఆర్ నటించిన మరో చిత్రం ఊసరవెల్లి కి దర్శకుడు కూడా సురేందర్ రెడ్డి నే ! మరి అప్పుడైనా ఎన్టీఆర్ కు సూపర్ హిట్ ఇవ్వొచ్చు కదా ! అశోక్ ప్లాప్ అయ్యింది కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకొని ఊసరవెల్లి చేసి ఉంటే బాగుండేది కానీ రెండోసారి కూడా ఊసరవెల్లి చిత్రంతో మరో ప్లాప్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ కు. అప్పట్లో ప్రభాస్ తో సినిమా చేయాలనీ అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ తో సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారని దాంతో మిస్ ఫైర్ అయ్యిందని అంటున్నారు సురేందర్ రెడ్డి.