హోళీ పండగ జరుపుకున్న ఎన్టీఆర్

Published on Mar 10,2020 08:11 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోళీ పండగని జరుపుకున్నాడు. ఈ హోళీ పండగని తన భార్యా పిల్లలతో కలిసి జరుపుకోవడం విశేషం. భార్య లక్ష్మీ ప్రణతి తో పాటుగా ఇద్దరు కుమారులతో కలిసి హోళీ ని చేసుకున్నాడు ఎన్టీఆర్. తెల్లని వస్త్రాలు ధరించి రంగులు పూసుకుంటూ మంచి జోష్ తో పండగ చేసుకున్నారు ఎన్టీఆర్ అండ్ కో. పండగ పూట ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి ఫోటోలకు ఫోజు ఇస్తూ వాటిని అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇంకేముంది ఆ ఫోటోలు ఎన్టీఆర్ అభిమానులను సంతోషంలో ముంచెత్తేలా ఉన్నాయి.

ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకులు అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు. తెలంగాణ పోరాటయోధుడు కొమరం భీం పాత్రని పోషిస్తున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమా వచ్చే ఏడాది 2021 జనవరి 8 న విడుదల కానుంది. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నటిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.