బిగ్ బాస్ 3 కి హోస్ట్ గా మళ్ళీ ఎన్టీఆర్

Published on Jan 29,2019 02:05 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే . ఆ షో సూపర్ సక్సెస్ అయ్యింది . దాంతో తెలుగులో బిగ్ బాస్ రెండో సీజన్ స్టార్ట్ చేసారు అయితే ఈసారి ఎన్టీఆర్ కాకుండా నాని ని ఎంపిక చేసారు అది కూడా సక్సెస్ అయ్యింది కాకపోతే ఎన్టీఆర్ స్థాయిలో లేదు అని విమర్శలు వచ్చాయి దాంతో ఇప్పుడు రిస్క్ ఎందుకని కాబోలు మూడో సీజన్ కు ఎన్టీఆర్ నే బుక్ చేసారు బిగ్ బాస్ నిర్వాహకులు . 

ఇక ఈ మూడో సీజన్ కు ఎన్టీఆర్ కు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారట ! తెలుగులో కూడా సక్సెస్ అయిన షో అందునా మొదటి సీజన్ ని చేసి ఉన్న షో కాబట్టి ఎన్టీఆర్ కూడా పెద్దగా అభ్యంతరం చెప్పకుండానే ఓకే చేసాడట . దాంతో మూడో సీజన్ రెడీ అవుతోంది త్వరలోనే . కాకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు కాబట్టి గ్యాప్ లో ఈ బిగ్ బాస్ చేస్తాడన్న మాట .