అన్నయ్య సక్సెస్ కోసం వస్తున్న ఎన్టీఆర్

Published on Dec 22,2019 09:19 AM
అన్నయ్య కళ్యాణ్ రామ్ సక్సెస్ కోసం వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో        '' ఎంతమంచి వాడవురా '' అనే చిత్రం చేసాడు , ఈ సినిమా జనవరి 25 న విడుదల అవుతోంది. దాంతో జనవరి 6 న ఎంతమంచి వాడవురా అనే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున చేయనున్నారు. ఆ వేడుకకు తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడట . కళ్యాణ్ రామ్ కు సినిమారంగంలో చాలా మంచి పేరుంది కానీ కావాల్సిన సక్సెస్ మాత్రం దక్కడం లేదు పాపం దాంతో అన్నయ్య కోసం , ఆ సినిమాకు కాస్త హైప్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు ఎన్టీఆర్.

సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రంగా ఎంతమంచి వాడవురా అనే చిత్రం రూపొందిందట. సంక్రాంతి కి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ సంక్రాంతి బరిలో మహేష్ బాబు - అల్లు అర్జున్ ల చిత్రాలు పోటీ పడుతున్నాయి దానికి తోడు రజనీకాంత్ దర్బార్ కూడా వస్తోంది దాంతో తన సినిమాని జనవరి 25 న విడుదల చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటే ఖచ్చితంగా హిట్ కొడతాడు లేదంటే షరా మాములే ! ఎన్టీఆర్ మాత్రం అన్నయ్యసక్సెస్  కోసం ఆరాటపడుతున్నాడు పాపం.