బాహుబలి రికార్డులపై కన్నేసిన ఎన్టీఆర్ చరణ్

Published on Nov 30,2019 01:35 PM

బాహుబలి సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టాలని చూస్తున్నారు ఎన్టీఆర్ , రాంచరణ్ లు. తాజాగా ఈ ఇద్దరు హీరోలు నటిస్తున్న చిత్రం '' ఆర్ ఆర్ ఆర్ ''. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ , చరణ్ లు నటిస్తున్నారు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున పది భాషలలో ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అందుకే అలియా భట్ , ఒలీవియా మోరిస్ , అజయ్ దేవ్ గన్ లాంటి నటీనటులను తీసుకున్నారు. ఇలా మల్టీ లాంగ్వేజెస్ యాక్టర్స్ ఉండటంతో కూడా ఈ సినిమాకు మరింత స్కోప్ లభిస్తోంది . దీనివల్ల బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమనే ధీమాలో ఉన్నారు. జపాన్ , చైనా లలో కూడా ఆర్ ఆర్ ఆర్ ని విడుదల చేయడానికి చూస్తున్నాడు జక్కన్న. భారీ మల్టీస్టారర్ చిత్రం కాబట్టి తప్పకుండా భారీ అంచనాలు ఉంటాయి దాంతో సినిమా బాగుంటే తప్పకుండా బాహుబలి రికార్డులు బద్దలు కావడం ఖాయం.