బాలయ్య , చిరంజీవి లకు సవాల్ విసిరిన ఎన్టీఆర్

Published on Apr 22,2020 04:31 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సీనియర్ హీరోలైన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లకు సవాల్ విసిరాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు దాంతో దర్శకులు సందీప్ రెడ్డి వంగా రాజమౌళికి సవాల్ విసిరాడు. ఆ సవాల్ ని స్వీకరించిన జక్కన్న ఇంట్లో పనులు చేసి ఎన్టీఆర్ , రాంచరణ్ లకు ఆ ఛాలెంజ్ ని విసిరాడు. దాంతో జక్కన్న సవాల్ ని స్వీకరించిన ఎన్టీఆర్ వెంటనే తన ఇంట్లో పనులను చేసి వీడియో తీయడమే కాకుండా నాలాగే మీరు కూడా చేయండి అంటూ బాలయ్య బాబాయ్ తో పాటుగా చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ , దర్శకులు కొరటాల శివ కు సవాల్ విసిరాడు.

బాలయ్య బాబాయ్ సోషల్ మీడియాలోకి ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు దాంతో బాల బాబాయ్ అంటూ పోస్ట్ చేసాడు. మరి బాలకృష్ణ ఎన్టీఆర్ సవాల్ ని స్వీకరిస్తాడా ? అన్నది ఆసక్తికరంగా మారింది. బాలయ్య బాబాయ్ తో పాటుగా చిరంజీవి , నాగార్జున బాబాయ్ వెంకీ మామ అంటూ ట్వీట్ చేసాడు ఎన్టీఆర్. ఈ నలుగురు హీరోలతో పాటుగా కొరటాల కూడా సవాల్ స్వీకరించాల్సిందే.