ఎన్టీఆర్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన వెంకీ మామ

Published on Apr 23,2020 04:36 PM
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసాడు వెంకీ మామ. అయితే నేను ఎదురు చూస్తోంది గ్యాంగ్ లీడర్ చిరంజీవి కోసమని ట్వీట్ చేసాడు విక్టరీ వెంకటేష్. దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి విసిరిన సవాల్ ని స్వీకరించిన ఎన్టీఆర్ ఇంట్లో పనులు చేసి నలుగురు సీనియర్ హీరోలైన చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ లకు ఈ ఛాలెంజ్ విసిరాడు. దాంతో చిరు వెంటనే ఛాలెంజ్ అంటూ తన సంసిద్దతని వ్యక్తం చేసాడు.

ఇక ఈరోజు మరో సీనియర్ హీరో వెంకటేష్ స్పందించాడు ఛాలెంజ్ కు సిద్ధం అంటూ. అంతేకాదు చిరంజీవి లాగే వెంకీ కూడా ఓ చిన్న వీడియో ని పోస్ట్ చేసాడు తన మేనరిజంతో కూడిన వీడియోని. ఇక బాలకృష్ణ , నాగార్జున ఇద్దరు కూడా స్పందించాల్సి ఉంది. బాలకృష్ణ ఎన్టీఆర్ కు బాబాయ్ అన్న సంగతి తెలిసిందే. అలాగే నాగార్జునని కూడా బాబాయ్ అనే పిలుస్తాడు ఎన్టీఆర్. ఈ ఇద్దరు కూడా స్పందించి ఇంటి పనులు చేస్తే ఈ కరోనా వేల మంచి కాలక్షేపమే అని చెప్పాలి.