పూణే షెడ్యూల్ కి సిద్దమైన ఎన్టీఆర్ , చరణ్

Published on Mar 13,2020 02:48 PM

కొమరం భీం , అల్లూరి సీతారామరాజు లు పూణే వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కొమరం భీం , అల్లూరి సీతారామరాజు లు ఏంటి ? పూణే వెళ్లడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షెడ్యూల్ కోసం పూణే వెళ్లనున్నారు ఎన్టీఆర్ , చరణ్ లు. ఇంతకుముందు కూడా పూణే షెడ్యూల్ ఉండే కానీ ఆ సమయంలో చరణ్ గాయపడటంతో ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది.

ఇక అప్పటి నుండి మళ్ళీ పూణే వెళళ్లేడు కట్ చేస్తే ఇప్పుడు పూణే వెళ్తున్నారు. ఎన్టీఆర్ , చరణ్ లతో పాటుగా అజయ్ దేవ్ గన్ కూడా పాల్గొననున్నాడట. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమౌతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని 2021 జనవరి 8 న భారీ ఎత్తున విడుదల కానుంది.