రజనీకాంత్ కు సమన్లు జారీ చేసిన జడ్జి

Published on Feb 05,2020 05:10 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ కు సమన్లు జారీ చేసారు జడ్జి అరుణ్ జగదీశన్. ఇంతకీ రజనీకాంత్ కు ఈ సమన్లు ఎందుకు జారీ చేసారో తెలుసా ..... తమిళనాడు లోని తూత్తుకుడి లో విషాద సంఘటన జరిగిన విషయం తెలిసిందే. తూత్తుకుడి లోని రాగి కర్మాగారంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన జరుగగా ఆ ఉద్యమంలో హింస చెలరేగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాగా ఆ కాల్పులలో 13 మంది ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో గాయాలపాలయ్యారు.

కాగా ఆ సమయంలో రజనీకాంత్ ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వాళ్ళని పరామర్శించడమే కాకుండా అసలు ఈ సంఘటన ఎలా జరిగిందో నాకు తెలుసు అంటూ మీడియా ముందు మాట్లాడటమే రజనీకాంత్ చేసిన తప్పు. దాంతో ఈనెల 25 న అరుణ్ జగదీశన్ ఇక సభ్య కమీషన్ ముందు హాజరు కావాలంటూ రజనీకాంత్ కు సమన్లు జారీ చేసారు. దాంతో ఈనెల 25 న కమీషన్ ముందు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రజనీకాంత్ ని ఆరోజు విచారించనున్నారు.