విజయ్ దేవరకొండని రిజెక్ట్ చేయలేదట !

Published on Mar 05,2020 02:37 PM

విజయ్ దేవరకొండని దిశా పటాని రిజెక్ట్ చేయలేదని అంటోంది నటి , నిర్మాత ఛార్మి. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రం చేస్తున్న విషయం విదితమే ! కాగా ఆ చిత్రంలో హీరోయిన్ గా హాట్ భామ దిశా పటానిని తీసుకోవాలని అనుకున్నారట దర్శకులు పూరి జగన్నాధ్ కానీ వాళ్లకు ఝలక్ ఇచ్చి విజయ్ దేవరకొండని రిజెక్ట్ చేసిందని పుకార్లు పుట్టాయి. ఈ పుకార్లు ఛార్మి వరకు చేరడంతో వాటిని ఖండిస్తోంది.

దిశా పటాని చాలా మంచి అమ్మాయి మాకు ఆమెతో మంచి సంబంధాలు ఉన్నాయి అయితే మా ఫైటర్ కోసం ఆమెని అస్సలు అనుకోలేదు , కథ క్యారెక్టర్ ప్రకారం అనన్య పాండే అయితేనే మంచిదని అనుకున్నాం ఆమెని మాత్రమే కలిసాం ఓకే అయ్యింది అంతే తప్ప దిశాని కలవడం ఆమె తిరస్కరించడం అంటూ ఏమి జరగలేదు అని కుండబద్దలు కొట్టింది ఛార్మి. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో పాన్ ఇండియా చిత్రంగా చిత్రీకరిస్తున్నారు ఫైటర్ ని. విజయ్ దేవరకొండ ఆశలన్నీ ఇప్పుడు ఈ ఫైటర్ మీదే ఉన్నాయి ఎందుకంటే వరుసగా మూడు ప్లాప్ లు చవిచూశాడు కాబట్టి.