అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుంటుందట

Published on Feb 28,2019 12:36 PM

అల్లు అర్జున్ అంటే నాకు చాలా చాలా ఇష్టమని అందుకే అతడ్ని పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది మలయాళ భామ  లవర్స్ డే హీరోయిన్ నూరిన్ షరీఫ్ . రోషన్ , ప్రియా ప్రకాష్ వారియర్ , నూరిన్ షరీఫ్ లు హీరో హీరోయిన్ లుగా నటించిన చిత్రం లవర్స్ డే . ఫిబ్రవరి 14 న  దినోత్సవం రోజున విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయం పొందింది . 

దాంతో క్లైమాక్స్ ని మార్చారు , మార్చిన క్లైమాక్స్ తో తాజాగా కొన్ని థియేటర్ లలో రిలీజ్ చేసారు లవర్స్ డే చిత్రాన్ని . దాంతో మీడియా ముందుకు వచ్చిన ఈ భామ అల్లు అర్జున్ అంటే ఇష్టమని , పెళ్లి చేసుకుంటానని అంటోంది . అయితే ఆల్రెడీ అల్లు అర్జున్ కు పెళ్లి అయ్యింది ఇద్దరు పిల్లలు కూడా . మరి ఎలా చేసుకుంటుందో అల్లు అర్జున్ ని .