ప్రియా ప్రకాష్ ని తిడుతున్న మరో హీరోయిన్

Published on Feb 23,2019 05:35 PM

మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ని తిడుతోంది మరో హీరోయిన్ నూరిన్ షరీఫ్ . ఇంకోసారి ప్రియా ప్రకాష్ వారియర్ తో నటించేది లేదు అంటూ ఖరాకండిగా చెప్పేసింది ఈ భామ . వింక్ గర్ల్ గా పేరుపొందిన ప్రియా ప్రకాష్ '' ఓరు ఆధార్ లవ్ '' చిత్రంలో అసలు హీరోయిన్ కాదట ! హీరోయిన్ గా అనుకున్నది నూరిన్ షరీఫ్ ని అంట అయితే ఎప్పుడైతే కన్ను కొట్టే వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యిందో అప్పుడే దర్శక నిర్మాతలు కథలో మార్పులు చేసి ప్రియా ని మెయిన్ హీరోయిన్ ని చేశారట . 

కన్ను కొట్టే వీడియో వల్ల నా పాత్రని తగ్గించారని అందుకే ఇకపై ప్రియా ప్రకాష్ వారియర్ నటించే చిత్రాల్లో నటించకూడదు అని డిసైడ్ అయ్యానని అంటోంది . అన్నట్లు నూరిన్ షరీఫ్ కు చాలా మంచి పేరు వచ్చింది . ఇక ఆ మలయాళ చిత్రాన్ని తెలుగులో లవర్స్ డే గా రిలీజ్ చేసారు . కానీ తెలుగులోనే కాదు మలయాళంలో కూడా అట్టర్ ప్లాప్ అయ్యింది ఆ చిత్రం .