మా లొల్లి మళ్ళీ అయ్యేలా ఉంది

Published on Nov 27,2019 12:57 PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లొల్లి కొద్దిరోజులుగా సైలెంట్ అయిపొయింది అయితే తాజాగా సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ తో మళ్ళీ మా లొల్లి అయ్యేలా కనబడుతోంది. నేను అధ్యక్షుడిగా ఎన్నికయిన వ్యక్తిని నామినేటెడ్ పర్సన్ ని కాదు , తొలగిస్తే పోవడానికి అయినా .... సభ్యులందరూ మూకుమ్మడిగా రాజీనామా చేయాలనీ పట్టుబడితే తప్పకుండా అధ్యక్షుడిగా వైదొలుగుతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు నరేష్.

ఏడెనిమిది నెలల క్రితం మా అధ్యక్ష ఎన్నికలు జరుగగా శివాజీరాజా పై నరేష్ ఘనవిజయం సాధించాడు. అయితే నరేష్ ప్రెసిడెంట్ అయిన కొంత కాలానికే నరేష్ - రాజశేఖర్ ల మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్నాయి. దాంతో నరేష్ ని తొలగించి రాజశేఖర్ ని అధ్యక్షుడిని చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. దాంతో సినిమారంగంలోని పలువురు ప్రముఖులు కల్పించుకొని ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేశారు. దాంతో కాబోలు నరేష్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసాడు. నరేష్ వ్యాఖ్యలు తప్పకుండా రాజశేఖర్ వర్గాన్ని సవాల్ చేసినట్లే అని అంటున్నారు. అంటే మళ్ళీ మా లొల్లి ఖాయం అనే చెప్పాలి.