అందాలు చూపిస్తే తప్పేంటన్న ఈషా రెబ్బా

Published on Nov 20,2019 12:21 PM
తెలుగమ్మాయి ఈషా రెబ్బా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఈ భామ చేసిన వ్యాఖ్యలు ఏంటో తెలుసా ........ అందాలు ఉన్నది చూపించడానికే ....... నా అందాలు చూపిస్తే తప్పేంటి ? అంటూ వ్యాఖ్యానించి షాక్ ఇచ్చింది. అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఈషా రెబ్బా కు తెలుగులో అవకాశాలు వస్తూనే ఉన్నాయి కానీ ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రావడం లేదు దాంతో స్కిన్ షో కు సిద్ధమైంది ఈ భామ.

ఇటీవల తరచుగా స్కిన్ షో చేస్తూ అందాల ఆరబోతకు సిద్ధం అయ్యింది. తరచుగా స్కిన్ షో చేస్తున్నప్పటికీ ఈ భామకు పెద్ద హీరోల చిత్రాల్లో ఛాన్స్ లు మాత్రం రావడం లేదు. అందం , అభినయం పుష్కలంగా ఉన్న ఈషా రెబ్బా తెలుగమ్మాయి కాబట్టి స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఆశిద్దాం. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడం లేదు అని గగ్గోలు పెట్టే దర్శక నిర్మాతలు హీరోలు ఈషా రెబ్బా లాంటి హీరోయిన్ లకు ఛాన్స్ ఇవ్వొచ్చుకదా ! అని అంటున్నారు పలువురు.