లిప్ లాక్ ఇస్తే తప్పులేదట

Published on Feb 05,2020 04:57 PM

లిప్ లాక్ ఇస్తే తప్పేంటి , అందులో తప్పేముంది అని ఎదురు ప్రశ్న వేస్తోంది హీరోయిన్ రాశి ఖన్నా. తాజాగా ఈ భామ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం విడుదలకు సిద్ధమైంది దాంతో మీడియా ముందుకు వచ్చింది రాశి ఖన్నా. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఫిబ్రవరి 14 న విడుదల అవుతోంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా తో పాటుగా ఐశ్వర్య రాజేష్ , కేథరిన్ ట్రెసా , ఇసా బెల్లె అనే మరో ముగ్గురు హీరోయిన్ లు కూడా నటిస్తున్నారు.

అయితే రాశి ఖన్నా ఈ చిత్రంలో యమా హాట్ గా నటించినట్లు టీజర్ ని చూస్తే తెలుస్తోంది. టీజర్ లోనే లిప్ లాక్ లు , అలాగే నగ్న దేహంతో బాత్ రూంలో స్నానం చేస్తూ కనిపించిన తీరుకి షాక్ అయ్యారు. కట్ చేస్తే ఇదే విషయాన్నీ రాశి ఖన్నా ముందు ఉంచితే లిప్ లాక్ లో , నగ్న దేహంతో నటిస్తే తప్పేంటి ? అని ప్రశ్నిస్తోంది. కథ , క్యారెక్టర్ డిమాండ్ మేరకే ఎవరైనా అలా నటిస్తారు తప్ప సరదాకు లిప్ లాక్ చేయరు కదా అని అంటోంది రాశి ఖన్నా. మొత్తానికి గడుసుదే అనిపించింది తన సమాధానంతో. టీజర్ లోనే ఇంత హాట్ గా నటిస్తే రేపు విడుదలయ్యే ట్రైలర్ లో ఎలా రెచ్చిపోయిందో మరి.