మహేష్ బాబుతో గొడవలు లేవట

Published on Oct 31,2019 03:19 PM
మహేష్ బాబు తో నాకు ఎలాంటి గొడవలు , సవాళ్లు ప్రతి సవాళ్లు ఉండవని స్పష్టం చేసింది లేడీ సూపర్ స్టార్ విజయశాంతి. 13 ఏళ్ల తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకుంటోంది విజయశాంతి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలో కీలక పాత్రలో భారతి క్యారెక్టర్ పోషిస్తోంది విజయశాంతి.

అయితే మహేష్ బాబు హీరో విజయశాంతి కీలక పాత్ర కావడంతో ఈ ఇద్దరి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు ఉంటాయని సహజంగా అనుకుంటారని కానీ ఈ సినిమాలో మామధ్య అలాంటివేవీ లేవని అంటోంది విజయశాంతి. మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2020 జనవరి 12 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక షూటింగ్ లో మహేష్ తనకు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాడని మహేష్ ని పొగుడుతోంది విజయశాంతి.