నెటిజన్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నివేదా థామస్

Published on Nov 11,2019 11:19 AM

తెలుగులో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి సత్తా చాటిన మలయాళ భామ నివేదా థామస్ తాజాగా నెటిజన్ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఈ భామకు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ? సోషల్ మీడియాలో తన అభిమానులతో సరదాగా మాట్లాడాలని లైవ్ లోకి వస్తే అది అదనుగా చేసుకున్న కొంతమంది ఆకతాయిలు తమ పరిధి దాటి నువ్ వర్జినా ? ప్రేమలో పడ్డావా ? నన్ను పెళ్లి చేసుకుంటావా ? అంటూ నివేదా థామస్ కు చిర్రెత్తుకొచ్చేలా ప్రశ్నించారు.

దాంతో నివేద థామస్ నెటిజన్ల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే నేరుగా ఇలా ప్రశ్నలను అడిగిన వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేయలేదు. తన సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫామ్ లో నిప్పులు కక్కింది నివేదా థామస్. మమ్మల్ని చులకనగా చూడటం మానండి మేము కూడా మనుషులమే......  మాకు వ్యక్తిత్వం  ఉంటుందని గ్రహించమని అంటోంది నివేదా థామస్.