నిత్యామీనన్ ఎందుకు లావయ్యిందో తెలుసా ?

Published on Sep 28,2019 09:50 AM

మలయాళ కుట్టి నిత్యామీనన్ అసలే బొద్దుగుమ్మ అయితే ఈమధ్య మరీ కాస్త లావు అయ్యింది అందుకు కారణం ఏంటో తెలుసా ........ తమిళనాడు అమ్మ జయలలిత బయోపిక్ లో నటించడమే ఇందుకు కారణం. తమిళనాట ''ఐరన్ లేడీ '' అనే చిత్రంలో నటిస్తోంది నిత్యామీనన్. జయలలిత పాత్ర పోషిస్తుండటంతో ఆమె కాస్త లావుగా ఉంటుంది కాబట్టి నిత్యా ఆ పాత్ర కోసం లావు అయ్యింది.
అయితే అసలే బొద్దుగుమ్మ ఆపై మరింత లావు కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేసారు నిత్యామీనన్ పై దాంతో ఆమె అదే స్థాయిలో నెటిజన్ల పై మండిపడింది. కట్ చేస్తే ఆమె ఎందుకు లావు అయ్యిందో ఇప్పడు అర్ధం అవుతోంది. జయలలిత బయోపిక్ అంటే పెద్ద పెద్ద వివాదాలకు ఆస్కారం ఉంది మరి. ఈ సినిమా విడుదల అయ్యాక కానీ తెలీదు ఎన్ని సంచలనాలు సృస్టించనుందో ఈ ఐరన్ లేడీ.