నిత్యామీనన్ ని కూడా వేధించారట

Published on Dec 01,2019 06:08 PM

మలయాళ భామ నిత్యామీనన్ ని కూడా వేధించారట అయితే నాకు అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు అధైర్య పడకుండా గట్టిగా వార్నింగ్ ఇచ్చానని దాంతో నాతో మళ్ళీ అసభ్యంగా ప్రవర్తించడానికి ధైర్యం చేయలేదని అంటోంది. మీ టూ అనేది అన్ని రంగాల్లో ఉందని , మిగతా రంగాల మాదిరిగానే సినిమారంగంలో కూడా ఉందని అయితే మనం ఎంత ధైర్యంగా , ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని సలహాలు ఇస్తోంది నిత్యామీనన్.

గతకొంత కాలంగా దేశంలో మహిళల పట్ల లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద చర్చ సాగుతోంది. అందరి లాగే నాకు కూడా కొన్ని వేధింపులు ఎదురయ్యాయని అయితే వాటిని గట్టిగా ఎదుర్కొన్నాను కాబట్టే మరోసారి నావైపు చూడాలంటే హడలి చస్తారని అంటోంది. అంతేగా గట్టిగా సమాధానం చెప్పి ధైర్యంగా ఉంటే అల్లరి మూకలు తోక ముడవడం ఖాయం.