యూత్ ని ఆకట్టుకుంటున్న భీష్మ సింగిల్ యాంథమ్

Published on Dec 28,2019 12:13 PM

భీష్మ సింగిల్ యాంథమ్ కు యూత్ నుండి విపరీతమైన స్పందన వస్తోంది. కుర్రకారుని అలరించేలా రూపొందిన ఈ పాట వైరల్ అవుతోంది. పేరుకి భీష్మ కానీ జోడి కోసం తహతహలాడే యువకుడి ఆవేదన ఎలా ఉంటుందో చక్కగా వివరించేలా సాగింది ఈ యాంథమ్. ఈ పాటని శ్రీమణి రచించగా అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. ఇక ఈ చిత్రానికి సంగీతం అందిస్తోంది మహిత్ స్వరసాగర్. ఇప్పటికే నితిన్ - రష్మిక మందన్న ల ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా నితిన్ - రష్మిక జోడీ ప్రేక్షకులను అలరించేలాగే కనబడుతోంది.

ఈ జంట చూడముచ్చటగా ఉంది, దాంతో భీష్మ చిత్రానికి ఎనలేని క్రేజ్ వస్తోంది. ఛలో వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల ఈ భీష్మ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకీ కుడుములకు ఇది రెండో సినిమా కావడం విశేషం. టాలీవుడ్ లో ద్వితీయ విఘ్నంని అధిగమించిన దర్శకులను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. మిగతా వాళ్ళు రెండో ప్రయత్నంలో దెబ్బతిన్నారు. మరి వెంకీ పరిస్థితి ఏంటి అన్నది భీష్మ తేల్చనుంది.