నితిన్ పెళ్లి వాయిదాపడింది

Published on Mar 30,2020 11:34 PM
హీరో నితిన్ పెళ్లి అనుకున్నట్లుగానే వాయిదాపడింది. ఏప్రిల్ 16 న నితిన్ - షాలిని లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ అని పెద్ద ఎత్తున ప్లాన్ చేసారు. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో దుబాయ్ లో కాకుండా ఇండియాలోనే కొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కట్ చేస్తే కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ ప్రకటించారు. లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు అయిపోతుంది ఏప్రిల్ 16 కాబట్టి ఫరవాలేదు చూద్దామని అనుకున్నారు కట్ చేస్తే కరోనా విలయతాండవం చేస్తుండటంతో వాయిదా తప్పలేదు.

ఈరోజు నితిన్ పుట్టినరోజు అందుకే ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇక పెళ్లి ఎప్పుడు అన్నది కరోనా మహమ్మారి తగ్గిన తర్వాత ప్రకటించనున్నారు. మొత్తానికి బ్యాచ్ లర్ లైఫ్ కి ముగింపు పలకాలని భావించాడు నితిన్ కానీ కాలం మరోలా ఆలోచించింది అందుకే నితిన్ పెళ్లి వాయిదాపడింది. గత నెలలో భీష్మ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో సూపర్ హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడేమో రంగ్ దే అంటున్నాడు.