నితిన్ ఎంగేజ్ మెంట్ అయ్యింది

Published on Feb 15,2020 08:51 PM

ఎట్టకేలకు యంగ్ హీరో నితిన్ ఎంగేజ్ మెంట్ అయ్యింది ఈరోజు. షాలిని అనే యువతిని నితిన్ ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా షాలిని - నితిన్ ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమ పెళ్ళికి పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్ళికి రంగం సిద్ధమైంది. ఇక ఈరోజు శనివారం రోజున నితిన్ - షాలిని ల ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ వేడుకకు కొద్దిమంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు.

ఇక పెళ్లి ఏప్రిల్ 16 న దుబాయ్ లో జరుగనుంది. దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని అనుకున్నారు నితిన్ - షాలిని అందుకే వాళ్ళ కోరిక మేరకు దుబాయ్ లో పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసారు. ఈ పెళ్ళికి దుబాయ్ కి కొద్దిమందిని ఆహ్వానించారు. మరికొంతమందికి ఆహ్వానం కూడా పలకనున్నారు. దుబాయ్ నుండి వచ్చాక ఇక్కడ అంగరంగ వైభవంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నాడు నితిన్