భీష్మతో హిట్ కొట్టిన నితిన్

Published on Feb 21,2020 04:21 PM
భీష్మతో హిట్ కొట్టిన నితిన్

యంగ్ హీరో నితిన్ భీష్మ చిత్రంతో ఎట్టకేలకు హిట్ కొట్టాడు. ఈరోజు వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది భీష్మ చిత్రం. వెంకీ కుడుముల దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించింది. నితిన్ - రష్మిక మందన్న జంట చూడముచ్చటగా ఉండటమే కాకుండా ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోందట భీష్మ.

ఓవర్ సీస్ లో ముందుగానే విడుదల అవుతుందన్న విషయం తెలిసిందే. దాంతో భీష్మ టాక్ వచ్చేసింది. ఓవర్ సీస్ టాక్ ప్రకారం సినిమా సూపర్ హిట్ అని అంటున్నారు. సినిమా ఆద్యంతం మంచి ఎంటర్ టైన్ మెంట్ అలాగే అలరించే పాటలు , నితిన్ - రష్మిక ల జోడి వెరసి భీష్మ సూపర్ హిట్ అని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా షోలు పడ్డాయి కొద్దీ సేపట్లోనే ఇక్కడి టాక్ కూడా రానుంది. మొత్తానికి భీష్మ సూపర్ హిట్ అని తేలింది.