నితిన్ పరిస్థితి ఏంటి ?

Published on Feb 09,2019 12:10 PM

యంగ్ హీరో నితిన్ గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు . భారీ బడ్జెట్ తో తీసిన లై డిజాస్టర్ అయ్యింది , దాని తర్వాత చల్ మోహన రంగా చేస్తే అది కూడా ప్లాప్ అయ్యింది . ఇక దిల్ రాజు పై ఎన్నో ఆశలు పెట్టుకొని చేస్తే శ్రీనివాస కళ్యాణం కూడా డిజాస్టర్ అయ్యింది దాంతో ప్లాప్ లలో హ్యాట్రిక్ కొట్టాడు నితిన్ . వరుస పరాజయాలు షాక్ ఇవ్వడంతో ఏ చిత్రం చేయాలో తెలీక సతమతం అవుతున్నాడు ఈ హీరో . 

ఛలో వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల తో భీష్మ అనే చిత్రం చేయడానికి పూనుకున్నాడు కానీ అది కూడా డౌటే అని వినబడుతోంది . ఛలో తో హిట్ ఇచ్చినప్పటికీ ద్వితీయ విఘ్నం ని జయిస్తాడా ? ఇదొక ప్రశ్నకు మారింది పాపం . దాంతో చాలా తీవ్రంగా కొట్టుమిట్టాడుతున్నాడట నితిన్ .