భీష్మ టీజర్ రేపే

Published on Jan 11,2020 11:38 AM

నితిన్ - రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భీష్మ చిత్ర టీజర్ విడుదలకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 1ఓ గంటలకు భీష్మ టీజర్ ని విడుదల చేయనున్నారు. ఆమేరకు హీరో నితిన్ భీష్మ టీజర్ గురించి అప్ డేట్ ఇచ్చాడు. ఛలో వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ భీష్మ చిత్రం రూపొందుతోంది. పేరుకి భీష్మ అనే టైటిల్ కానీ సినిమాలో ఎక్కువగా అమ్మాయిల వెంట పడే యువకుడిగానే కనిపించనున్నాడట నితిన్. ఇక నితిన్ - రష్మిక మందన్న ల జంట చూడముచ్చటగా ఉంది.

ఇటీవల విడుదలైన పలు ప్రచార చిత్రాలు ఇదే విషయాన్నీ తెలియజేస్తున్నాయి. గతకొంత కాలంగా నితిన్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. దాంతో ఈ భీష్మ చిత్రంపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. వెంకీ కుడుములకు ఇది రెండో సినిమా. ఛలో తర్వాత వెంకీ చేస్తున్న సినిమా కావడంతో టెన్షన్ కూడా ఉంది మరి. ఎందుకంటే మొదటి సినిమా హిట్ కొట్టినవాళ్లు రెండో సినిమాతో దెబ్బ తింటున్నారు కొంతమంది మాత్రమే ద్వితీయ విఘ్నం ని అధిగమించారు.