ప్లాప్ డైరెక్టర్ తో నితిన్

Published on Mar 30,2019 03:02 PM

ఛల్ మోహనరంగా చిత్రంతో నితిన్ కు అట్టర్ ప్లాప్ ఇచ్చాడు దర్శకులు కృష్ణచైతన్య అయితే అలాంటి దర్శకుడితో మరోసారి సినిమా చేస్తున్నానని ప్రకటించాడు హీరో నితిన్ . దీంతో షాక్ అవ్వడం నితిన్ ఫ్యాన్స్ వంతు అయ్యింది . పాటల రచయిత అయిన కృష్ణచైతన్య రౌడీ ఫెలో చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు . నారా రోహిత్ హీరోగా నటించిన ఆ చిత్రం ప్లాప్ అయ్యింది అయినప్పటికీ నితిన్ ఛల్ మోహనరంగా చిత్రానికి ఛాన్స్ ఇచ్చాడు . 

కట్ చేస్తే సినిమా ప్లాప్ అయ్యింది , అయినప్పటికీ మరోసారి ఛాన్స్ ఇచ్చి సంచలనం సృష్టిస్తున్నాడు నితిన్ పైగా తన సొంత బ్యానర్ లో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు నితిన్ . దర్శకుడిగా రెండుసార్లు విఫలమైన కృష్ణచైతన్య మరి ఈసారైనా హిట్ కొడతాడా ? నితిన్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా చూడాలి . 

నితిన్ , కృష్ణచైతన్య , ఛల్ మోహనరంగా , ఫిలిం న్యూస్ nithin , krishnachaitanya , film news , chal mohanaranga , 

Nithin another film with flop director